మ‌హిళా కండక్ట‌ర్ల కు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

తెలంగాణ ఆర్టీసీలో ప‌ని చేస్తున్న మ‌హిళా కండ‌క్ట‌ర్ల కు ఎండీ స‌జ్జ‌నార్ గుడ్ న్యూస్ చెప్పాడు. మ‌హిళా కండ‌క్టర్ల డ్యూటీ ఎక్కువ రాత్రి వ‌ర‌కు ఉండేది. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ తీసుకున్న నిర్ణ‌యంతో మ‌హిళా కండ‌క్ట‌ర్ల పని వేల‌లు కాస్త మారనున్నాయి. మ‌హిళా కండ‌క్ట‌ర్లు తమ విధుల‌ను రాత్రి 8 వ‌ర‌కు ముగిసే విధంగా చూడాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల‌తో మ‌హిళా కండ‌క్ట‌ర్లు రాత్రి 8 వ‌ర‌కు విధులు ముగించుకుని బ‌స్ డీపోల‌కు చేర‌నున్నారు.

మహిళా కండ‌క్ట‌ర్ల కు ఒక వేళ‌ డ్యూటీ రాత్రి 8 త‌ర్వాత వేయాల్సి వ‌స్తే.. దానికి సంబంధించిన వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు. మ‌హిళా కండ‌క్ట‌ర్ల విధుల స‌మ‌యాలపై ఇచ్చిన ఆదేశాల‌ను రాష్ట్రంలోని రీజిన‌ల్ మేనేజ‌ర్లు అంద‌రూ, డివిజ‌నల్ మేనేజ‌ర్లు, అన్ని డిపోల మేనేజర్లు పాటించాల‌ని ఆదేశించారు. అయితే రాత్రి స‌మ‌యాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ త‌గ్గించ‌డం తో మ‌హిళా కండ‌క్ట‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.