రైతుబంధు ఆపడానికి వీలులేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

-

రైతులకు పెట్టుబడి సాయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు సాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలులేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. రైతు భరోసా పేరుతో రైతులకు రూ.15,000 ఇస్తామని మాట తప్పారని ఫైర్ అయ్యారు. రైతు భరోసా స్కీమ్పై క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారని, క్యాబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. క్యాబినెట్ సబ్ కమిటీ రైతులను మోసం చేయడానికి వేసిన కమిటీ అని అన్నారు.

రైతు ఋణమాఫీతో సంబంధం లేకుండా రైతు బంధు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. పింఛన్ల పెంపు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరే మెదపడం లేదని, విద్యుత్ బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండన్నారు. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరు లోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు వచ్చేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news