రైతుబంధు కటాఫ్ పై రేవంత్‌ రెడ్డి కేబినెట్ లో రగడ….?

-

రైతుబంధు కటాఫ్ పై సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ గా మారింది. రైతుబంధు కటాఫ్ పై రేవంత్‌ రెడ్డి కేబినెట్ లో రగడ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ హాల్ లో నిన్న నిర్వహించిన కేబినెట్ లో ఆరు గ్యారంటీల అమలుకయ్యే ఖర్చుపై లెక్కలు వేసిందట మంత్రివర్గం. ప్రస్తుత బడ్జెట్ కంటే మూడింతల బడ్జెట్ అవసరమని తేల్చిందట కేబినెట్. పథకాల అమలులో కొర్రీలు పెట్టాలని సీఎం రేవంత్ సూచనలు చేశారట.

రైతుబంధు 5 ఎకరాల లోపు వారికే ఇవ్వాలన్న సీఎం రేవంత్‌, మహాలక్ష్మి పథకంలోనూ కోతలు, బస్సుల సంఖ్య తగ్గించి నష్టాన్ని నివారించాలని సూచనలు చేసినట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అందరికి ఇస్తామని చెప్పి, అన్ని ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదన్నారట తుమ్మల. మరి ఎట్లా అమలు చేయాలో సీనియర్ మంత్రిగా మీరే చెప్పండి అని తుమ్మలను ప్రశ్నించారట రేవంత్. లెక్కలు వేసుకోకుండా ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారని ఎదురు ప్రశ్నించారట తుమ్మల. ఇక మధ్యలో కలుగజేసుకుని శాంతిపజేశారట పొంగులేటి. ఆరు గ్యారెంటీల చర్చను పక్కన పెట్టి, గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపి అర్దాంతరంగా ముగించారట మంత్రివర్గ సమావేశం.

Read more RELATED
Recommended to you

Latest news