మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే.. పార్టీ మార్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు కేసిఆర్ సముచిత స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. చేవెళ్ల చెల్లెమ్మగా ఆమెను పిలుస్తారు. వైఎస్ హయాంలో ఆమె హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆమె దేశంలోనే ఓ రాష్ట్రానికి హోం మంత్రిగా తొలిసారిగా పనిచేసిన మహిళగా రికార్డులకెక్కారు.