బైడెన్‌ వైదొలగాల్సిందేనని పెరుగుతున్న డిమాండ్లు.. క్లారిటీ ఇచ్చిన డెమోక్రాటిక్ పార్టీ

-

మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న క్రమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్.. రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.

పాలక డెమోక్రటిక్‌ పార్టీలోని పలువురు కీలక నాయకులతోపాటు కొన్ని ప్రముఖ వార్తాసంస్థలూ ఈ డిమాండ్ చేస్తున్నాయి. దేశానికి సేవ చేయాలంటే, అధ్యక్ష పదవి రేసు నుంచి బైడెన్‌ వైదొలగాలంటున్నాయి. ఈ దఫా ఆయన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కొనసాగడంలో హేతుబద్ధత ఏమీ లేదుని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి బైడెన్‌ను తప్పించడం అత్యంత దేశభక్తితో కూడిన ఐచ్ఛికం అని ‘ది అట్లాంటిక్‌’ పేర్కొంది. తాను పోటీలో కొనసాగనున్నట్లు తాజాగా న్యూజెర్సీలో తన మద్దతుదారులతో మాట్లాడుతూ బైడెన్‌ పునరుద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news