లగచర్ల రైతు హీర్యా నాయక్ బేడీల ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. లగచర్ల రైతు హీర్యా నాయక్ బేడీల ఘటనలో సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్ సస్పెండ్ అయ్యాడు. అయితే..సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్ సస్పెండ్ కావడంపై బీఆర్ఎస్ పార్టీ భిన్నంగా స్పందిస్తోంది.
తమ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం.. జైలర్ సంతోష్‌కుమార్ ని బలి చేశారని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్. చెడ్డపేరు రావడంతో.. తప్పుదోవ పట్టించేందుకే సంతోష్ మెడకు కత్తి పెట్టిందని… బేడీలతో హీర్యా నాయక్‌కు ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పింది యంత్రాంగమే అంటూ పేర్కొంది బీఆర్ఎస్.
చడీచప్పుడు కాకుండా.. గోప్యంగా తీసుకెళ్లాలని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారని కూడా వెల్లడించింది. తీరా నిజం బయటపడేసరికి.. బేడీల వ్యవహారం జైలర్‌పై నెట్టేసేందుకు ప్రయత్నం తమకేమీ తెలియదని, తప్పంతా జైలర్‌దే అన్నట్టు చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తున్నట్లు సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్ సస్పెండ్ కావడంపై బీఆర్ఎస్ పార్టీ భిన్నంగా స్పందిస్తోంది.