ఎల్బీనగర్ లో ఐ.టి అధికారుల సోదాలు

-

ఈ మధ్య కాలంలో ఐటీ అధికారుల సోదాలు చాలా మంది పై నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఓ తహసీల్దార్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. అలాగే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ నివాసంలో తనిఖీలు చేపట్టి.. ఆస్తికి మించిన ఆస్తులు, నగదు తదితర వాటిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఎల్బీనగర్ లో ఐటీ సోదాలు నిర్వహించింది. 

బీజేపీ  నేత రాములు యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. అందెల శ్రీరాములు యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. రాములు ఇంటితో పాటు అతని పీఏ నివాసంలో   కూడా ఐటీ అధికారుల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లో కూడా పలు చోట్ల తనిఖీలు చేస్తున్న ఐటి అధికారులు.  అందెల శ్రీరాములు బిజినెస్ పాట్నర్ ప్రతిభ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారుల సోదాలు చేపడుతుండటం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news