సీటుబెల్టు ఆ యువ వైద్యురాలిని కాపాడింది.

-

కారు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవాలని తరచూ పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తుంటారు. కానీ.. కొందరు అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఓ యువ వైద్యురాలు నిబంధనలు పాటించి సీటు బెల్టు పెటుకోవడంతో ఆమె ప్రాణాలు దక్కికి ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

సైదాబాద్‌ పూర్ణాదేవీకాలనీకి చెందిన డాక్టర్‌ ఎ.దివ్యారెడ్డి(26), గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్‌ డ్యూటీ చేసిన డాక్టర్‌ దివ్యారెడ్డి ఉదయం విధులు ముగించుకుని తన కారులో ఇంటికి బయలుదేరింది. ఔటర్‌ పై నుంచి హిమాయత్‌సాగర్‌ వద్ద దిగి రాజేంద్రనగర్‌ మీదుగా చంద్రాయణగుట్ట వైపు వెళ్తుంది.

కుక్కను తప్పించబోయి..

గాంధీనగర్‌ మందిరం క్రాస్‌ అవుతుండగా అకస్మాతుగా ఓ కుక్క కారుకు అడ్డువచ్చింది.అప్రమత్తమైన ఆమె కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న సైన్‌బోర్డును ఢీకొడుతూ అలాగే ముందున్న రాళ్లను గుద్దుకొని ఆగిపోయింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడే ఆమె సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అటుగా వెళ్తున్న పలువురు వాహనదారులు ఆ కారును గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్వల్ప గాయాలతో బయటపడిన దివ్యారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఏదీ ఏమైనా సీటుబెల్టు మాత్రం ఆ యువ వైద్యురాలి ప్రాణాలు పాడిందని అక్కడున్న వారు చర్చించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news