సినియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం చనిపోయారు. రాజకీయ నాయకులంతా బాబాయ్‌గా పిలుచుకునే కృస్ణారావు జర్నలిజం ప్రస్తానం ఈనాడుతో మొదలై, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సాగింది.
ఇక సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ఎంవీ కృష్ణారావు (పెద్ద బాబాయి) గారి అకాల మరణం బాధాకరం అన్నారు బండి సంజయ్. పెద్ద బాబాయిగా అందరికీ సుపరిచితులైన కృష్ణారావు గారు గత నాలుగు దశాబ్దాలుగా పలు మీడియా సంస్థల్లో పనిచేస్తూ ఎనలేని సేవ చేశారని..సమకాలీన రాజకీయ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారు నిక్కచ్చిగా తన అభిప్రాయాలను చెబుతారనే పేరుగాంచారని వివరించారు. ఏ మీడియా సంస్థలో పనిచేసినా తనదైన ముద్ర వేసిన కృష్ణారావు గారి మరణం పత్రికా రంగానికి తీరని లోటు చెప్పారు..కృష్ణారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.