దాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని అన్నారు. మధురలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకు మద్దతుగా ప్రసంగించారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ టిఆర్ఎస్ అని చెప్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం చూడాలన్నారు టిఆర్ఎస్ ను గెలిపిస్తే రైతుబంధు ఏడాదికి రూ.16,000 ఇస్తామని చెప్పారు కెసిఆర్ 24 గంటల విద్యుత్ ఉండాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలను కోరారు.
దళిత సమాజం దోపిడికి గురైంది అన్నారు. దళితులు పేదరికం తొలగించేందుకు దళిత బందు తీసుకొచ్చామని తెలిపారు. దళిత బంధు లాంటి ఆలోచన కాంగ్రెస్ ఏనాడైనా చేసిందా అని ప్రశ్నించారు. మధిరలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించింది. టిఆర్ఎస్ అని పాత మెజారిటీ కంటే.. రెండు సీట్లు పెంచుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గ మధురకు చుట్టపు చూపుగా వస్తారని విమర్శించారు కేసీఆర్. బట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు అని విషయాన్ని ప్రస్తావించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు.