కాంగ్రెస్ లో 20 మంది సీఎంలు : కేసీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు స‌చ్చేది లేదు.. ఆ పార్టీకి 20 సీట్లే వ‌స్తాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థి లింగాల క‌మ‌ల్‌రాజ్‌కు మ‌ద్దతుగా ప్ర‌సంగించారు. కాంగ్రెసోళ్లు కొత్త డ్రామా మొద‌లు పెట్టిండ్రు. కాంగ్రెస్‌లో ఇవాళ డ‌జ‌న్ మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు.

వాడు గెలిచేది లేదు స‌చ్చేది లేదు. గ్యారెంటీగా చెబుతున్నా.. మ‌ళ్ల గ‌దే 20 సీట్లు. 20 లోపే ఇంకా. ఇవాళ మ‌ధిర ప‌ర్య‌ట‌న‌తో 70 నియోజ‌క‌వ‌ర్గంలో మాట్లాడుతున్నా. నేను ఇంకా 30 నియోజ‌క‌వ‌ర్గాలు వెళ్లాల్సి ఉంది. అయింతా 30 పోతే ఇంకా ఊడ్సుకపోత‌ది కాంగ్రెస్. నేను ఎట్లేట్ల పోతనో.. అట్ల ఊడ్సుకోని పోతున్న‌ది కాంగ్రెస్. ఏం లేదు అంత వ‌ట్టిదే డంబాచారం. చాలా బ్ర‌హ్మాండంగా పాత మెజార్టీ కంటే రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుంది. అందులో మీకు ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news