CPI పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది – సీపీఐ నారాయణ

-

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింది..సిపిఐ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చురకలు అంటించారు.

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని..రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడి పోయిందని నిప్పులు చెరిగారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించింది..కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో ఒక ఎంపీ, ఏపిలో ఒక ఎంపీ సీట్లో పోటీ చేస్తామని..బతికి వుండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారని వివరించారు. పాస్ బుక్ లో జగన్ ఫోటోలు ఎందుకు.. శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా….పాస్ బుక్ లో జగన్ ఫోటోలు ఎందుకు.. శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news