తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకం నిషేదం

-

తెలంగాణలో 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఆరోగ్య శ్రీ సేవల విలువను రూ.10లక్షలకు పెంచేసింది. అలాగే యువత పై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాన్ని నిషేదిస్తూ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 

ఆ ఉత్తర్వుల్లో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లొని సెక్షన్ 30లోని సబ్ సెక్షన్ 2లో క్లాజ్ ఏ కింద అనుసరించిన అధికారాలను అమలు చేయడంలో 2,3,4 ఆహార భద్రత, ప్రమాణాలు, రెగ్యులేషన్ ప్రజారోగ్య దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు, నికోటిన్, పౌచ్ లు, ఫ్యాకేజీ, కంటెయనర్లు మొదలైన వాటిలో ఫ్యాక్ చేసిన గుట్కా, పాన్ మసాాలా తయారి, నిలువ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేదించబడింది. 

Read more RELATED
Recommended to you

Latest news