ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు లోకి.. హీరోయిన్ ఫోన్ ట్యాప్..!

-

బీఆర్ఎస్ హాయంలో ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎస్ఐబీ మాజీ క్రైమ్ లైఫ్-స్టైల్ ఎడిట్ పేజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లే ట్యాప్ చేసారనే ప్రచారం జరుగుతోండగా తాజాగా పలువురు హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ నాయకులకు పంపినట్టు తెలుస్తోంది.

హీరోయిన్ల ఫోన్ కాల్స్ వినడం, రికార్డ్ చేయటం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రికార్డింగ్ కాల్స్తో పాటు చాట్ హిస్టరీని కూడా చోరీ చేసి, ఆ డాటాను పెన్ డ్రైవ్లు, ఈ మెయిల్స్ ద్వారా కొందరు రాజకీయ పెద్దలకు పంపినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డాటా వారికి ఉద్దేశ్యపూర్వకంగా స్వలాభం కోసం వాడుకున్నారా? లేక హీరోయిన్లపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సామాజిక మాద్యమాల్లో వార్తలొస్తున్నాయి. అయితే ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఇందులో ఎవరి హస్తం ఉందనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news