యావత్ దళిత జాతికి అవమానం.. రేవంత్ క్షమాపణ చెప్పాలి : బాల్క సుమన్

-

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అవమానం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూజ సందర్భంగా సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ పీటలపై కూర్చుని డిప్యూటీ సీఎం భట్టిని మాత్రం నేలపై కూర్చొబెట్టారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. యావత్ దళిత జాతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణినీ పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన మంత్రి కొండా సురేఖను క్రిందా కూర్చోబెట్టారని అన్నారు. సాక్ష్యాత్తూ దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే.. దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి.. ఎవరికి
చెప్పుకోవాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైనా బట్టి విక్రమార్కనే అవమానించారన్నారు. 74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతూనే ఉందని ధ్వజమెత్తారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి భట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్లో ఆయన ఫోటోను పక్కన పెట్టారని అన్నారు. ఇవాళ యాదాద్రిలో జరిగిన ఘటనపై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విసూనురి రామచంద్ర రెడ్డీ లాంటి వాడు రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హై కామండ్ స్పందించేలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news