శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారుల కంట చిరుత పడింది. ఎయిర్ పోర్ట్ ప్రహరీ చుట్టూ పెట్రోలింగ్ చేస్తున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ కంటపడింది చిరుత. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించింది సిఎస్ఎఫ్ సెక్యూరిటీ. గత నాలుగు రోజులుగా చిరుతను బంధించే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అటవీశాఖ అధికారులు. చిరుత బోన్ వద్దకు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్లి పారిపోతుండడంతో చిరుతను పట్టేందుకు సవాల్ గా మారింది అపరేషన్.
చిరుతను పట్టేందుకు మరో ప్రయోగిస్తామంటున్నారు అటవీశాఖ అధికారులు. చిరుత భయం గుప్పెట్లో ఎయిర్ పోర్ట్ చుట్టు గ్రామాల ప్రజలు ఉన్నారు. పొలం వద్దకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు జనాలు. చిరుతను అధికారులు త్వరగా బంధించి తమ భయం గుప్పెట్లో నుండి కాపాడాలని స్థానిక ప్రజలు విన్నపం చేస్తున్నారు.పొలాల వద్దకు కర్రలు పట్టుకొని వెళుతున్నారు చుట్టుపక్క గ్రామ ప్రజలు యువకులు. ఎప్పుడు ఎటు నుంచి చిరుత వచ్చి తమపై దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు స్థానిక యువకులు.