DK అరుణ కాదు…KD అరుణ – వైఎస్ షర్మిల

-

డికె. అరుణమ్మ ను రాజకీయంగా వైఎస్సార్ పైకి తెచ్చారు…వైఎస్సార్ బిడ్డ తెలంగాణ రాజకీయాలకు వచ్చింది అంతే అరుణ కి నచ్చలేదన్నారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ బిడ్డ కు ఇక్కడేం పని అరుణ అంటుంది..వైఎస్సార్ బిడ్డ ను నేను..ఇదే గడ్డ మీద పెరిగిన ..ఇక్కడే చదువుకున్నానని తెలిపారు.

ఇక్కడే చదువుకున్న…ఇక్కడే బిడ్డను కన్నా..నా బ్రతుకు ఇక్కడే..నా గతం ఇక్కడే అని పేర్కొన్నారు. తెలంగాణ లో వైఎస్సార్ పాలన లేదు కాబట్టే…పార్టీ పెట్టా అని అరుణ తెలుసు కోవాలి…తెలంగాణ కోసం వైఎస్సార్ కుటుంబం ఏం చేసింది అని అరుణ అడుగుతుందని ఫైర్ అయ్యారు.

డి కె అరుణ కాదు..కే డి అరుణ..ఇది మీ బీజీపీ నాయకులు అంటున్నదే…మీరు ఒక మహిళ…ఇక్కడ ఆసుపత్రి లో కాన్పు కోసం వెళ్తే సౌకర్యాలు లేవని విమర్శలు చేశారు. నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు కదా ..ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version