ఆయన కోసం టాలీవుడ్ హీరోలు చనిపోవాల్సిందేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా అక్కడి స్టార్ హీరోలు కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతంగా ఇష్టపడతారు ఇకపోతే ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా టీజర్ విడుదల అయింది. ఇందులో చిరంజీవి లుక్ చూశాక కొంతమంది నుంచి పాజిటివ్ రెస్పాండ్ వస్తుంటే మరి కొంతమంది నెగటివ్గా కామెంట్లు చేస్తున్నారు.. గతంలో చిరంజీవి సినిమాలు అంటే సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు కానీ ఇటీవల కాలంలో ఆయన సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపలేకపోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి కూడా ప్రేక్షకుల సినిమా దాహం తీర్చాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఒక అద్భుతం జరగాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే గాడ్ ఫాదర్ టీజర్ కూడా పెద్ద అద్భుతంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు అంటూ ఒక వర్గం అభిమానులు కూడా భావిస్తున్నారు. సినీ తారలు ఎప్పుడు కూడా చిరంజీవి సినిమాలలో చిరంజీవి కోసం చనిపోతూ త్యాగం చేయాల్సిందేనా అంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే చాలు అందులో చనిపోయే క్యారెక్టర్ లో అచ్యుత్ బాగా నటించేవాడు .ఇప్పుడు ఆ పాత్ర కోసం సత్యదేవ్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ మధ్యలోనే చనిపోయి చిరంజీవికి హిట్ ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఇలా ఆయన కోసం ఎవరో ఒకరు టాలీవుడ్ హీరో చనిపోవాల్సిందేనా అంటూ అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు.

ఆచార్య సినిమా మధ్యలోనే రాంచరణ్ చనిపోతాడు. ఇలా హీరో చనిపోతే తప్ప చిరంజీవికి హిట్టు దొరకదా అంటూ సినీ ప్రేక్షకుడు ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ సినిమాతో ఈయన ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version