హరీష్ రావును కలిసిన వైఎస్‌ షర్మిల

-

మాజీ మంత్రి హరీష్ రావును వైఎస్‌ షర్మిల కలిశారు. వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ మాజీ మంత్రి, సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావుని ఆయన నివాసంలో కలిశారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

Sharmila invited former minister Harish Rao to her son’s wedding

ఇక అటు వైఎస్ షర్మిలా రెడ్డి ఇవ్వాళ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. కాగా, ఇప్పటికే తన అన్నయ్య వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కూడా వైఎస్ షర్మిలా రెడ్డి పత్రిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news