BREAKING : ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో షర్మిల పాదయాత్ర

-

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఎక్కింది. తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల గారు రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

ఇది ఇలా ఉండగా, కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు స్వాతంత్ర్యం అన్నారు వైఎస్ షర్మిల. YSR తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంత వరకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేదు.. తెలంగాణ బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగానికి తగరా? అర్హులు కారా? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.దళిత బంధు అన్నారు.. బీసీ బంధు అన్నారు.. మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు.. ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ గారికి అంటూ రెచ్చిపోయారు షర్మిల. ఆనాడు బ్రిటిష్ వాళ్లు తెల్ల దొరలు పాలిస్తే .. ఈరోజు తెలంగాణలో మన నల్ల దొర కేసీఆర్ ఒక దొర లాగే పరిపాలిస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news