హైదరాబాద్‌ వాసులకు కేసీఆర్‌ శుభవార్త..నేటి నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ

-

హైదరాబాద్‌ వాసులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. జీహెచ్ఎంసి పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్స వానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచే అర్హులైన పేదలకు ఆదజేస్తుందని కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్…అనంతరం మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని వివరించారు. కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందన్నారు. దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రభుత్వం వారిలో ఆనందం నింపింది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిందన్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news