రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మైలర్, కెసిఆర్ ఓ దొర : షర్మిల

వరంగల్ రైతు డిక్లరేషన్ పై వైఎస్ షర్మిల ఫైర్‌ అయ్యారు. రైతు సమస్యలు పై వారికి అవగాహన రావాలని.. ఒకే సభలో రెండు మాటలు… రాహుల్ గాంధీ ది ఒక మాట,,, రేవంత్ రెడ్డి ది ఒక మాట అంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రజల్లో నమ్మకం లేదు…రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మైలర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కి ఓటు వేస్తే అది తెరాస కు పోతుంది… జనాలకు అర్థం అయ్యిందని చురకలు అంటించారు. 1000km పాదయాత్ర పూర్తి అయ్యిన సందర్భంగా.. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నాని విమర్శించారు వైఎస్‌ షర్మిల.

సీఎం కెసిఆర్ గారు ఒక దొర… ఆయన ఎవరిని గౌరవించడు.. గవర్నర్ కాదు కదా ఎవరికి గౌరవం ఇవ్వడని ఫైర్‌ అయ్యారు. మహిళా అని కూడా చూడక పోవడం… ఎంటి అని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏదని నిలదీశారు. పట్ట పగలు రైతు లు దోపిడీకి గురవుతున్నారని… రైతు బంధు కింద 5వెలు ఇస్తున్నారు… మద్దతు ధర ఇవ్వండని డిమాండ్‌ చేశారు.