ఎమ్మెల్సీ ఎన్నిక‌ల మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన శ‌శాంక్ గోయ‌ల్

తెలంగాణ రాష్ట్రం లో త్వ‌ర‌లో జ‌ర‌గబోయే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల మార్గ‌ద‌ర్శ కాల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శశాంక్ గోయ‌ల్ విడుద‌ల చేశారు. ఆదిలాబాద్ జిల్లా లో మొత్తం 8 పోలింగ్ స్టేషన్లు ఉండ‌నున్నాయి. అలాగే మొత్తం 937 ఓటర్లు ఉన్నారు. అలాగే అదిలాబాద్ లో ఒక్క స్థాననికి 2 అభ్యర్థులు బరిలో ఉన్నారు.

అలాగే క‌రీంన‌గ‌ర్ లో 8 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే మొత్తం 1324 ఓటర్లు ఉన్నారు. మొత్తం 2 ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు. మెదక్ లో మొత్తం 9 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే మొత్తం 1026 ఓటర్లు ఉన్నారు. మెదక్ లో ఒక్క స్థానానికి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే నల్గొండలో 8 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం1271 ఓటర్లు ఉన్నారు. అలాగే ఒక్క స్థానానికి ఏడుగురు అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా లో 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో మొత్తం 768 ఓటర్లు ఉన్నారు. ఇక్క‌డ ఒక్క స్థానానికి నలుగురు అభ్య‌ర్థులు బరిలో ఉన్నారు.

 

అయితే మొత్తం గా అన్ని జిల్లాలో 37 పోలింగ్ స్టేష‌న్ల ను ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే మొత్తం 5,326 ఓటర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు. అలాగే ఓట‌ర్లు అంద‌రూ కరోనా నియమాలు పాటించాలని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శ‌శాంక్ గోయ‌ల్ సూచించాడు. ఏకగ్రీవం అయిన జిల్లాలలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాల‌ని కేంద్ర ఎన్నికల సంఘంకు లేఖ రాశామని తెలిపారు.