అసదుద్దీన్ కి ఊహించని షాక్.. జన్ లోక్ పాల్ సర్వేలో సంచలన ఫలితాలు వెలుగులోకి..!

-

లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ్రౌండ్ రిపోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు ప్రైవేటు సంస్థలు నిర్వహించిన సర్వేలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను నెలకొనేలా చేస్తున్నాయి. తాజాగా.. తెలంగాణలో జన్ లోక్పాల్ సంస్థ చేపట్టిన సర్వే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

ఇప్పటి వరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంచుకోటగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీటలు వారే టైమొచ్చిందంటూ సర్వేలో తేలింది. తాజగా జన్ లోక్పాల్ విడుదల చేసిన ఓటు షేర్ సర్వేలో ఎంఐఎం-44.25 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది. అనూహ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ-42.03 శాతం ఓటు షేర్తో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఇక బీఆర్-4.05 శాతం, ఇతరులు-2.97 శాతం ఓటు షేర్తో తరువాత స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ కేవలం 2 శాతం ఓటు షేర్తో ద్వితీయ స్థానంలో ఉంటడం ఓవైసీని కలవరపెడుతోంది. ఏది ఏమైనా పోలింగ్ నాటకి పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version