సామాన్యులకు షాక్..తెలంగాణలో కరెంటు బిల్లుల మోత

-

తెలంగాణలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. కరెంటు చార్జీలను 5శాతం మాత్రమే పెంచామని డిస్కౌమ్ లు చెబుతుండగా..వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఏకంగా 60 శాతానికి పైగా చార్జీలు పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఇక 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి 27శాతం పెరిగాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగా.. బిల్లులు వారం రోజులుగా వినియోగదారుల చేతికి వస్తున్నాయి.

మార్చి నెలలో 83 యూనిట్ల విద్యుత్ ను వినియోగించిన ఒక వినియోగదారుడికి రూ. 188 బిల్లు రాగా.. ఏప్రిల్ నెలలో 89 యూన్నిట్లు వాడినందుకు ఏకంగా రూ. 307 బిల్లు వచ్చింది. వాస్తవానికి కరెంటు చార్జీల పెంపునకు డిస్కంలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(TSERC) కి సమర్పించిన పిటిషన్లలో గృహ వినియోగదారులకు 880 యూన్నిట్ల వరకు వినియోగానికి గానూ యూనిట్ కి 50 పైసలు చొప్పున పెంచుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే దీనికి తోడు గతంలో ఎప్పుడూ లేని స్థిర చార్జీలను కొత్త గా వసూలు చేస్తున్నాయి.

ఈ స్థిర చార్జీలను రూ.15 చొప్పున వసూలు చేస్తామని ఈఆర్సికి డిస్కంలు తెలుపగా రూ.10 వసూలు చేయాలని ఈఆర్సి ఆదేశించింది. అయినా కొన్ని స్లాబ్ లకు రూ .14 దాకా వేశారు మరోవైపు వినియోగదారుల ఛార్జీలను కూడా పెద్ద మొత్తంలో పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news