OMG.. ఇలా చేసిన పాప్ కార్న్.. అలాంటి ఫిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా..?

-

ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఏటా కోటి మందికి పైగానే ఈ మహమ్మారి భారిన పడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అంత మంది ఎలా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసకున్నప్పటికీ క్యాన్సర్ ఎటాక్ తప్పడం లేదు.. జన్యుపరమైన కారణాలు కొన్ని అయితే.. మన జీవనశైలి కూడా క్యాన్సర్ రావడానికి కొంత కారణం అవుతుంది.

కణవ్యవస్థను పాడు చేసే ఆహారాలు తీసుకోవడం వలన ఈ వ్యాధి భారిన పడక తప్పడం లేదు. క్యాన్సర్ కు నూనెలో వేయించినవి, దేవినవి, జంక్ ఫుడ్స్ మాత్రమే కారణం అనుకుంటారు.. కానీ మనం హెల్తీ అని తీసుకునే కొన్ని పదార్థాలు కూడా క్యాన్సర్ కు కారణం అవుతాయి. వాటిని తయారు చేసే క్రమంలో చేసే తప్పులే వీటికి కారణం.. అలాంటి కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం..

ఫిష్..

మీరు అస్సలు నమ్మలేరు కదా.. చేపలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనం ఎప్పుడు వింటాం కానీ.. చేపలు కూడా క్యాన్సర్ కు కారణం అవుతాయి అని అస్సలు అనుకోని ఉండరు. సాల్ట్‌ ఫిష్‌ (ఉప్పు కలిపిన చేపలు)ను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాల్ట్ ఫిష్ అంటే ఉప్పుతో ఎక్కువ కాలం భద్రపరిచిన చేప అని అర్థం. ఈ పద్ధతి ఆసియా, చైనాలో ఎక్కువ పాటిస్తారు. ఈ పద్ధతి క్యాన్సర్ కారక లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ చేపలు తీసుకుంటే.. కేన్సర‌ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
డైరీ ఉత్పత్తులు. మన దగ్గర కూడా ఉప్పు చేపలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటి వారు వాటిని తగ్గించి.. నార్మల్ ఫిష్ తినటం మేలు.

రెడ్ మీట్..

దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. అనేక రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి.. మీరు వారానికి 65-100 గ్రాముల కంటే ఎక్కువగా రెడ్‌ మీట్‌ తినకూడదట.

డెయిరీ ప్రొడెక్ట్స్..

ఓడియమ్మ.. డెయిరీ ప్రొడెక్ట్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా అనుకుంటున్నారా..? అసలు పాలు, పెరుగు, జున్ను, పన్నీర్ ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయాయి. అవును వీటివల్ల ప్రొటీన్, కాల్షియం లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి.. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే.. కొన్ని పాల ఉత్పత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 2014 నివేదిక ప్రకారం, పాల ఉత్పత్తులను తింటే IGF-1 స్థాయిని పెంచుతుందని తేలింది.. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

పాప్‌ కార్న్‌..

ఇది కూడా మీకు ఆశ్యర్యం కలిగించవచ్చు. టైం పాస్ కు లాగించేస్తుంటారు.. ఎంత తింటున్నామో కూడా తెలియకుండా టీవీ చూస్తూ తినటం అందరికి అలవాటుగా ఉంటుంది. నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిదే.. కానీ మైక్రోవేవ్‌లో పాప్‌కార్న్‌ను తయారు చేస్తే.. PFOA అనే మూలకం విడుదలవుతుంది. పీఎఫ్‌ఓఏ వల్ల ప్యాంక్రియాస్, కిడ్నీ, కాలేయం, మూత్రాశయానికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని గ్యాస్ మీద చేసుకుంటే ఎలాంటి లొల్లి ఉండదు.

ఆహార పదార్థాలు మంచివే.. కానీ వాటిన వండే తీరు, నిల్వ చేసే పద్దతి వల్లే అవి అనేక రకాల జబ్బులకు కారణం అవుతున్నాయి. ఏదైనా ఇంట్లోనే ఫ్రష్ గా చేసుకుని తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news