మూడు కాళ్ళతో శిశువు పుట్టడం చూసి ఉంటాం… నాలుగు చేతులతో శిశువు పుట్టడం చూసి ఉంటాం. ఒక కాలుతో శిశువు పుట్టి ఉండటం చూసి ఉంటాం గాని… తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత జరిగింది. ఒక కన్నుతో శిశువు జన్మించింది. అవును వినడానికి షాకింగ్ గా ఉన్నా సరే ఈ ఘటన జరిగింది. ఎక్కడ అంటే తెలంగాణాలోని మంచిర్యాల జిల్లలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మంచిర్యాల… కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ ప్రియాంక దంపతులకు ఒకే కంటి రూపంతో బాబు పుట్టాడు. బాబు పుట్టాడు అనే ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. ప్రియాంక ను 108 లో లింగన్నపేట నుండి చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తున్న సమయంలో ఆస్పత్రికి చేరుకునే లోపే శిశువు పుట్టింది. అయితే మృతి చెందాడని వైద్యులు దృవీకరించడంతో మృతదేహన్నీ తీసుకుని వెళ్ళిపోయారు.