Shocking : టీఎస్ ఆర్టీసీలో మ‌రో సారి స‌మ్మె.. రెండు రోజుల పాటు ప్ర‌గ‌తి చ‌క్రాలు బంద్

-

తెలంగాణ ఆర్టీసీలో మ‌రో సారి స‌మ్మె స‌రైన్ మోగ‌నుంది. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్ర‌గ‌తి చ‌క్రాలు బంద్ కానున్నాయి. కాగ ఇప్ప‌టికే స‌క‌ల జ‌నుల స‌మ్మె తో పాటు ఇటీవ‌ల జీతాల కోసం చేసిన స‌మ్మెతో టీఎస్ ఆర్టీసీ భారీగా న‌ష్టాల్లో కురుకుపోయింది. కాగ ఇప్పుడు టీఎస్ ఆర్టీసీలో మ‌రో సారి స‌మ్మె జ‌ర‌గ‌నుంది. కాగ జాతీయ ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు స‌మ్మెలో పాల్గోన‌నున్నారు.

ఈ నెల 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా స‌మ్మె నిర్వ‌హించ‌డానికి జాతీయ ఆర్టీసీ కార్మికులు సిద్ధం అవుతున్నారు. స‌మ్మె కోసం బ‌స్ భ‌వ‌న్ లో సమ్మె నోటీస్ ను కార్మిక సంఘాలు ఇచ్చాయి. కాగ కేంద్ర ప్ర‌భుత్వం కార్మికుల‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని.. అందుకే స‌మ్మె చేస్తున్న‌ట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

కాగ ఎంవీ యాక్ట్ చ‌ట్టం – 2019ను పున‌రుద్ధించాల‌ని, టూరిస్ట్ ప‌ర్మిట్ పాలసీని ర‌ద్దు చేయాల‌ని జాతీయ ఆర్టీసీ కార్మికుల జేఏసీ డిమాండ్ చేస్తుంది. అలాగే పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలు కూడా స్టెట్ వ్యాట్ ను త‌గ్గించాల‌ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news