తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 90 కరోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య వంద లోపే న‌మోదు అవుతున్నాయి. కాగ నేటి క‌రోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 కరోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7,90,224 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

కాగ నేడు రాష్ట్ర వ్యాప్తం గా 25,658 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వ‌హించారు. అలాగే నేడు కూడా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ లేదు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం లేదు. అలాగే గడిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 172 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 1,141 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news