సీఎం కేసీఆర్‌కు రాఖీ క‌ట్టిన తోబుట్టువులు

-

తెలంగాణ ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పలువురు రాఖీలు కట్టారు. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాల‌కు వేదిక‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నిలిచింది. ముఖ్యంగా రాఖీ పండుగ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయ‌న తోబుట్టువులు రాఖీలు క‌ట్టారు.

అక్క‌లు ల‌క్ష్మీబాయి, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ‌, చెల్లెలు వినోద‌మ్మ క‌లిసి కేసీఆర్‌కు రాఖీ క‌ట్టి ఆశీర్వ‌దించారు. అనంత‌రం తోబుట్టువుల‌కు కేసీఆర్ పాదాభివంద‌నాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు. రాఖీ పండుగను ప్రతీ ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు సీఎం కేసీఆర్. అన్న చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version