గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓటములు చూస్తూ విజయం దగ్గర వరకు వచ్చి బోల్తా కొడుతూ..ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్న నాయకుల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకరు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన ఈయన..తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సర్పంచ్ స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో 1994లో ఎన్నికల బరిలో దిగి గెలిచారు. మలక్‌పేట్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 1999లో బిజేపితో పొత్తు వల్ల టిడిపిలో ఆయనకు సీటు దక్కలేదు.
ఇక నెక్స్ట్ మల్‌రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళి..2004 ఎన్నికల్లో మలక్‌పేట్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు టిడిపి అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో మల్‌రెడ్డి మహేశ్వరంలో పోటీ చేసి..టిడిపి అభ్యర్ధి తీగల కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టిడిపి మధ్య పొత్తు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దీంతో మల్‌రెడ్డికి సీటు దక్కలేదు.
పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం టిడిపికి దక్కింది. టిడిపి నుంచి సామా రంగారెడ్డి పోటీ చేశారు. బిఆర్‌ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పోటీ చేయగా, మల్‌రెడ్డి బిఎస్‌పిలోకి వెళ్ళి పోటీ చేసి..మంచిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చి కేవలం 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి ఇబ్రహీంపట్నంలో సత్తా చాటే దిశగా వెళుతున్నారు.
అక్కడ మళ్ళీ బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా మంచిరెడ్డి ఫిక్స్ అయ్యారు. ఇక కాంగ్రెస్ నుంచి మల్‌రెడ్డి ఫిక్స్..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే మంచిరెడ్డిపై వ్యతిరేకత ఉంది..ఇటు మల్‌రెడ్డికి సానుభూతి ఉంది. ప్రస్తుతం మల్‌రెడ్డికే ఎడ్జ్ కనిపిస్తుంది. చూడాలి మరి ఈ సారి ఇబ్రహీంపట్నంలో ఎవరు పై చేయి సాధిస్తారో.