హెరిటేజ్ కు లాభాలు వస్తే.. విజయ డైరీ ఎలా నష్టపోతుంది : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

-

రాష్ట్రంలో పాలన గాడితప్పింది. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూయించండి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. 10 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు అప్పుచేసినా ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదు. కేసీఆర్ గారి పాలనలో అప్పులు చేసి అనేక రంగాల్లో సమూల మార్పులకు బాటలు వేశాం. అప్పులు చేసి ఏం చేశారో తెలియదు. కానీ రుణమాఫీ మాత్రం చేయలేదు మొదట రూ.49 వేల కోట్లు రుణమాఫీకి అంచనా వేశారు .. రేవంత్ రూ.41 వేల కోట్లు అని ప్రకటించారు. బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు ప్రకటించారు. చివరికి రూ.17 వేల కోట్లు మాఫీ చేసి అయిపోయిందని చెబుతున్నారు.

రైతుభరోసా ఎగ్గొట్టారు .. పంటకాలం పూర్తవుతున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ భీమా గురించి గొప్పలు చెప్పారు. కొందరు ఆంధ్రా నేతల చేతుల్లో ఉన్న రైతుసంఘాలు ఈ వాదన తెచ్చాయి.. దానిని కాంగ్రెస్ అందుకుని కౌలు రైతులకు రైతుభరోసా అని బురిడీ కొట్టించింది. రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీకి మళ్లించారు .. ఇప్పుడు రైతుభరోసా పది ఎకరాల వరకే అంటున్నారు. విజయ డైరీ రైతులకు మూడు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. విజయ డైరీ ప్రభుత్వ డైరీ .. కేసీఆర్ హయాంలో లాభాలు ఎలా వచ్చాయి ? ఇప్పుడెలా నష్టాలు ఎలా వస్తాయి.. హెరిటేజ్ కు లాభాలు ఎలా వస్తాయి ? విజయ డైరీ ఎలా నష్టపోతుంది అని ప్రశ్నించారు. పాల రైతులను హెరిటేజ్ వైపు మళ్లించేందుకు కుట్ర జరుగుతుంది అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news