TSPSC పేపర్ లీకేజీ కేసు.. NRI అభ్యర్థులకూ నోటీసులు

-

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.  విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలను బట్టి పలువురికి సిట్ నోటీసులు ఇస్తోంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ వ్యవహారంతో సంబంధమున్న ప్రవాస భారతీయులపై సిట్‌ దృష్టి సారించింది.

విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారి గురించి సిట్ ఆరా తీస్తోంది. గ్రూప్‌-1 పరీక్షలో 100కుపైగా మార్కులు వచ్చిన 121 మందిలో పలువురిని ఇప్పటికే సిట్‌ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి పరీక్ష రాసినవారినీ గుర్తించింది. వారు కేవలం పరీక్ష రాసేందుకు వచ్చివెళ్లినట్లు తేలింది. కీలక నిందితుడు రాజశేఖర్‌ రెడ్డి సమీప బంధువు న్యూజిలాండ్‌ నుంచి వచ్చి పరీక్ష రాసినట్లు నిర్ధారణ అయింది. మరికొందరూ ఈ జాబితాలో ఉన్నట్లు తెలియడంతో వారికి నోటీసులు ఇచ్చి పిలిపించడంలో సిట్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news