‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

-

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ సాంగ్ కంపోజ్ చేస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం రో జున భేటీ అయ్యారు. ఈ గీతాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్‌ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ పాటను ఆవిష్కరించనున్నారు. సుమారు 6 నిమిషాల నిడివి కలిగి ఇప్పటికే ప్రాచుర్యం పొందిన గీతాన్ని అలాగే ఉంచి స్వరకల్పన చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఆలాపనకు వీలుగా 60 నుంచి 90 సెకన్లకు ఈ గీతాన్ని కుదించనున్నారు.

ఈ పాటలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు సమాచారం. అందులో జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఉండటంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలి.. అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆ పాటను ఒకటికి రెండు సార్లు విని.. అందులోని అంశాలపై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండడంతో…గతంలో పది జిల్లాలు అన్నపదాన్నితొలిగించినట్లు సమాచారం. ఆ స్థానంలో పద పద అన్నపదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news