ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి ఈ-గరుడ బస్సుల్లో స్నాక్​బాక్స్ ​

-

టీఎస్​ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న ఆర్టీసీ తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌టికెట్‌తో పాటే స్నాక్‌బాక్స్‌ను నేటి నుంచి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణికుల కోసం బస్సు మధ్యలో ఎక్కువ సార్లు అపే అవసరం ఉండదని అధికారులు యోచిస్తున్నారు. తొలుత హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ ఈ-గరుడ బస్సుల్లో ప్రవేశపెడుతున్నారు.

ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ఫ్రెషనర్‌, టిష్యూ పేపర్ స్నాక్‌బాక్స్‌లో ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను వసూలుచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.  ప్రతి స్నాక్‌బాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్‌ చేసి సంస్థకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు .

Read more RELATED
Recommended to you

Latest news