మూడు రోజుల షిరిడీ టూర్.. ఈ ప్రదేశాలని చూసి రావచ్చు..!

-

మీరు ఈ వేసవి లో షిరిడి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీకి పలు రకాల టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా షిరిడి వెళ్లి వచ్చేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. షిరిడీకి పలు రకాల టూర్ ప్యాకేజీలు వున్నాయి. హైదరాబాద్ నుండి షిర్డీకి ఈ టూర్ ప్యాకేజీ బాగుంటుంది. సాయి శివం పేరుతో అందించే రైల్ టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీ తో మీరు షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర్ చూసి రావచ్చు.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. మొదటి రోజు హైదరాబాద్‌లో ఇది మొదలు అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ రీచ్ అవుతారు. పర్యాటకులు దిగిన తర్వాత షిరిడీ బయల్దేరాలి. హోటల్‌లో చెకిన్ అయ్యాక షిరిడీ వెళ్ళాలి.

సాయంత్రం ఖాళీ సమయంలో షాపింగ్ చేయొచ్చు. రాత్రికి షిరిడీ లో ఉండాలి. మూడో రోజు ఉదయం నాసిక్ బయల్దేరాలి. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగ్ చూడచ్చు. తర్వాత పంచవటి ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌ లో ట్రైన్ ఎక్కాలి.
నాలుగో రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకోవడం తో టూర్ ముగుస్తుంది. స్లీపర్ క్లాస్ ప్రయాణానికి ట్రిపుల్ షేరింగ్‌కు రూ.4,200, ట్విన్ షేరింగ్‌కు రూ.4,940 చెల్లించాలి. ఇలా క్లాసులు బట్టీ ధర ఉంటుంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూసి బుక్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news