రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేసిన సోనియా…రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు.
“తెలంగాణ రాష్ట్ర సోదరసోదరీమణులందరికీ నమస్కారం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర కల సాకారాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని కరీంనగర్ ప్రజలకు 2004లో నేను హామీ ఇచ్చాను. ఈ వాగ్దానంతో మా పార్టీలో అంతర్గతంగా అసమ్మతి చెలరేగింది. చాలా మంది నేతలు మా పార్టీని కూడా వీడారు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం మీ ధైర్యం, సంకల్పం…. తెలంగాణ ఇచ్చి తీరాలనే శక్తి సాహసాలు, ప్రేరణను నాకు కల్పించాయి. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కార్యసిద్ధులై ఉంటారని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా… తెలంగాణ ప్రగతి, ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అని సోనియా గాంధీ తెలిపారు.