తెలంగాణ రాజకీయ వేదిక నుంచి కరాటే మ్యాట్ పైకి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా కరాటే రింగ్ లో తలపడ్డారు. ఇదేదో యాక్షన్ సినిమా సన్నివేశం కాదు.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం. శుక్రవారం గచ్చిబౌళి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం. శుక్రవారం గచ్చిబౌళి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో టీపీసీసీ చీఫ్ 2025 ఘనంగా ప్రారంభమైంది.
ఈ వేడుకలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్త చైర్మన్ శివసేనా రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కరాటే బెల్ట్ లు అందుకున్న వెంటనే ఇద్దరూ నేతలు కరాటే ఫోజులిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. నేతల సరదా పోజులు చూసి వేదికపైనే కాక ప్రేక్సకలోకంలో కూడా కాసేపు హర్షద్వానాలు మారుమ్రోగాయి. మామూలుగా సభల్లో మాటలతోనే ఎదిరించే రాజకీయ నాయకులు, ఇప్పుడు కరాటే రింగ్ లో తలపడుతున్నట్టు కనిపించడం విశేషం.