నిరంకుశ నిజాం పీడ విరుగుడైన రోజు.. బండి సంజయ్ ట్వీట్..!

-

తెలంగాణకు స్వాతంత్య్రం రాక ముందు నిజాం రాజులు పరిపాలించిన విషయం తెలిసిందే. జవహర్ లాల్ నెహ్రు ప్రధానిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రిగా ఆపరేషన్ పోలో పేరిట సెప్టెంబర్ 17, 1948 సైనికు నిజాం రాజు కోట పై దాడి చేయగా అప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకే తెలంగాణ ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక ట్వీట్ చేశారు. ః

“నిరంకుశ నిజాం పీడ విరుగుడైన రోజు.. రాక్షస రజాకర్ల పైశాచిక కరాల కృత్యాలకు చరమ గీతం పాడిన రోజు.. రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రం పొందిన రోజు.. సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పంతో, ఎన్.రాయ్ చౌదరి గారి నేతృత్వంలో, భారత మిలటరీ ధైర్య సాహసాలతో..ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా, మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా, నిజాం నిరంకుశ కబంధహస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు ‘సెప్టెంబర్ 17’. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ “తెలంగాణ విమోచన దినోత్సవ” శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version