రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడినందుకే ఎస్ఆర్ హెచ్ కి ఫైనల్ బెర్త్.. వీ.హెచ్. సంచలన వ్యాఖ్యలు

-

ఐపీఎల్ 2024 సీజన్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్ కతా తొలుత ఫైనల్ కి వెళ్లగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న రాజస్థాన్ తో గెలిచిన మ్యాచ్ లో ఫైనల్ కి వెళ్లింది. ఈ మ్యాచ్ విషయంలో రకరకాల ట్రోల్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో. ముఖ్యంగా రాజస్థాన్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. బెంగళూరు గెలిచి ఉంటే.. సెమిస్ లో పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు.

మరోవైపు ఏదైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ.హన్మంతరావు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. అప్పటికప్పుడు ప్రత్యర్థి లీడర్ల మీద సెటైర్లు వేయడం హన్మంతరావు స్టైలే వేరు. అలా శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ అద్భుతమైన విషయం సాధించింది. దీనిపై వీ.హెచ్. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఆడి ఎక్స్ పర్ట్స్ కావడం వల్లే ఐపీఎల్ ఫైనల్ కి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వీ.హెచ్. సన్ రైజర్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news