బంగాళఖాతంలో వాయుగుండం.. మరికొద్ది సేపట్లో తుఫాన్ గా మారే అవకాశం

-

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా మారితే రెమాల్ అని పేరు పెట్టనున్నారు. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. ఈ క్రమంలో.. కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉందని తెలిపింది.

పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయని.. వాటి ప్రభావంతో కోస్తా లోను వాతావరణం చల్లబడిందని వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు మేఘవృతమై ఉన్నాయని తెలిపింది. రెండు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడు, రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news