పోలీస్ శాఖ వారు ఎవరిని కూడా అనవసరంగా వేధించవద్దని కోరారు ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా మంథనిలో శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ….శ్రీపాదరావు ఆశయాల మేరకు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని…మంథని ప్రాంతం శాంతిభద్రలతో కూడిన చదువుల తల్లి ప్రాంతంగా ఏర్పడడానికి అందరూ సహకరించాలని కోరారు. శ్రీపాదరావు ఆశయాల మేరకు రైతులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మంథని ప్రాంతంలో వాణిజ్య వ్యాపారాల అభివృద్ధి కోసం మంథని వద్ద రెండు జిల్లాల పరిధిలో గోదావరి నదిపై మంథని వద్ద వంతెన నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. చిల్లర గాళ్లు చేసి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇలాంటి విషయాల్లో చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చట్టం పరిధిలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని కార్యకర్తలకు ఉపదేశం ఇచ్చారు ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.