బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం నేత‌ల క్యూ

-

భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం ప్ర‌దాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వేవ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో మ‌ల్ళీ భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలుస్తుంద‌ని కేంద్రంలో మూడోసారి ప్ర‌భుత్వాన్ని న‌రేంద్ర మోడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేయ‌బోతున్నార‌ని అన్ని స‌ర్వే సంస్థ‌లు తేల్చేశాయి.ఈ క్ర‌మంలో వివిధ రాజ‌కీయ పార్టీలు కూడా బీజేపీతో పొత్తు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎలాగైన ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములు కావాల‌ని మోడీ ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదే క్ర‌మంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తెలంగాణ బీజేపీలో ఈ సారి టిక్కెట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. తెలంగాణలో బీజేపీలో చేరేందుకు వివిద‌ పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు ఒకరి కంటే ఎక్కువ బలమైన నేతలు పోటీ పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సిట్టింగ్ ఎంపీ స్థానాలున్నాయి. వీటిలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధినేత జి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. దీంతోపాటు కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు, నిజామాబాద్ పార్లమెంటు సీటును ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర‌వింద్ కు ఖరారు చేశారు. మరో సిట్టింగ్ అయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.ఆయ‌న‌కు ఈసారి టికెట్ లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో కొత్త అభ్య‌ర్ధిని నిల‌బెట్టే సూచ‌న‌లు ఉన్నాయి. చేవేళ్ల సీటును గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి సీటును మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కు ఖరారు చేసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మహబూబ్ నగర్ , మల్కాజిగిరి వంటి ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గాల్లో టిక్కెట్ కోసం గట్టి పోటీ నెలకొంది.వీటి కోసం బ‌డా బ‌డా నేత‌లు పోటీ ప‌డుతున్నారు.

ఈసారి తెలంగాణ‌లో ఎక్కువ ఎంపీ సీట్ల‌ను గెల‌వాల‌ని చూస‌తున్న బీజేపి… బలమైన నేతలు వస్తే చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.సిట్టింగ్ ఎంపీలు అయిన బీబీ పాటిల్, రాములు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. చేవెళ్లే, మహబూబ్ నగర్, ఖమ్మం ఎంపీలుకూడా తమకు టిక్కెట్లు ఇస్తే వస్తామని బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఖమ్మం తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పరిశీలించే పరిస్థితి లేదు.మరికొంత మంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలంగాణలో బీజేపీకి నాలుగు సిట్టింగ్ స్థానాలుండగా, ఈ సారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలోని 12 ఎంపీ సీట్లపై గురి పెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. దీనికోసం ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు వెనుకాడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news