పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం

-

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రారంభం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. నార్లాపూర్ లోని కంట్రోల్ రూమ్ తొలి పంపు స్విచ్ ఆన్ చేసి జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు.

నార్లాపూర్ లో భూగర్భంలో పంపు హౌస్ లను ఏర్పాటు చేశారు. మొత్తం నీటి నిలువ సామర్థ్యం 67.52 టీఎంసీలు. 6 జిల్లాలలో 12 లక్షల 30వేల ఎకరాలకు సాగును అందించనున్నారు. రోజుకు 1.5 టీఎంసీలు ఎత్తిపోసేలా చేస్తున్నారు. 1226 గ్రామాలకు తాగునీరును అందించనున్నారు.90 టీఎంసీలు వినియోగించుకునేలా ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. తొలి ఘట్టం పూర్తి అయింది. దీంతో తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కల నెరవేరింది.

Read more RELATED
Recommended to you

Latest news