స్టేషన్ ఘనపూర్‌లో రివర్స్ స్కెచ్..సీటు మారుస్తారా?

-

ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీలోని తప్పులని సరిదిద్ది..పార్టీకి అధికారం కట్టబెట్టాలని చూస్తున్నారు. ఆ దిశగానే కే‌సి‌ఆర్ వ్యూహాలు వేస్తున్నారు. అదే సమయంలో పార్టీలో కొన్ని కీలక మార్పులు చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలని మారుస్తానని కే‌సి‌ఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

ఆ దిశగా ముందుకెళుతూనే..కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోతే పార్టీకే కాస్త నష్టం జరుగుతుంది. అలా జరగకుండా కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారిని వేరే సీట్లలోకి మార్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ ఘనపూర్ సీటులో మార్పులు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఘనపూర్ మొదట నుంచి కాంగ్రెస్ కు కాస్త అనుకూలమైన స్థానం..ఆ తర్వాత టి‌డి‌పి సత్తా చాటింది. నాలుగుసార్లు టి‌డి‌పి గెలిచింది. అందులో కడియం శ్రీహరి మూడుసార్లు గెలిచారు. ఇక 2009లో కాంగ్రెస్ నుంచి తాటికొండ రాజయ్య గెలిచారు..నెక్స్ట్ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చి 2012 ఉపఎన్నికల్లో గెలిచారు.

2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అటు టి‌డి‌పి నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన కడియం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఏదొరకంగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అదే సమయంలో రాజయ్యకు కాస్త అనుకూల వాతావరణం కనిపించడం లేదు. వరుసగా గెలుస్తుండటంతో ఆయనపై కాస్త వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో రాజయ్యని మార్చాలని కే‌సి‌ఆర్ చూస్తున్నట్లు తెలిసింది.

రాజయ్యని వరంగల్ ఎంపీ లేదా ఏదైనా మరో రిజర్వడ్ సీటుకు మార్చాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అదే సమయంలో ఘనపూర్ సీటు కడియం కుమార్తె కావ్యకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజయ్యని మార్చినట్లు ఉంటుంది..ఘనపూర్ లో కొత్త అభ్యర్ధి వచ్చినట్లు అవుతుంది. మరి ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news