పొంగులేటి చేరికతో కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లు..ఖమ్మంలో రచ్చ షురూ.!

-

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఆయన అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన చేరికపై ట్విస్ట్‌లు నడిచాయి. బి‌జే‌పి నేతలు సైతం ఆహ్వానించారు. దీంతో పొంగులేటి ఎటు వెళ్తారో క్లారిటీ రాలేదు. చివరికి జూపల్లి కృష్ణారావుతో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారు.

అయితే పొంగులేటి చేరడం వల్ల ఖమ్మంలో కాంగ్రెస్‌కు కాస్త బలం వస్తుంది. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అక్కడ సీట్ల విషయంలో ట్విస్ట్‌లు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అలాగే 10 చోట్ల పొంగులేటి వర్గం నేతలు ఉన్నారు. దీంతో ఎవరికి సీటు దక్కుతుందనేది చూడాలి.  పొంగులేటి తాను కాంగ్రెస్‌లో చేరాలంటే.. తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుంచారని తెలిసింది. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సానుకూలంగా స్పందించిందన్న ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే పొంగులేటి వర్గం తరపున పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటనుంచి జారె ఆదినారాయణ, ఇల్లెందులో జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, వైరాలో బానోతు విజయబాయి, సత్తుపల్లిలో రిటైర్డు పీఆర్‌ ఈఈ సుధాకర్‌రావు పేర్లు వినిపిస్తుండగా.. కొత్తగూడెం లేదంటే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో దిగుతారని తెలుస్తుంది.

ఇక పొంగులేటి వర్గానికి సీట్లు ఇస్తే..పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇబ్బందులు తప్పవు. అయితే అన్నీ సీట్లు పొంగులేటి వర్గానికి ఇవ్వడం కష్టం. ఇరువురిని సమన్వయం చేసుకుని, అభ్యర్ధుల బలాన్ని బట్టి సీటు ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్..వర్గాల వారీగా టికెట్లు ఉండవని, సర్వేల ఆధారంగానే గెలుపు అవకాశాలున్న వారికి అభ్యర్థిత్వాలు ఉంటాయని స్పష్టం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news