ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నా – హరీష్ రావు మరో ఛాలెంజ్

-

రుణమాఫీ విషయంలో ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్టు 15లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదన్నారు హరీష్ రావు. రుణమాఫీ పాక్షికంగానే జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమారే ఒప్పుకున్నాడని.. రుణమాఫీ పూర్తిగా జరగలేదని మంత్రులు కూడా అంటున్నారని చెప్పుకోచ్చారు.

ఆగస్టు 15లోగా పూర్తి రుణమాఫీ చేయాలని తాను చాలెంజ్ చేశానని.. ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని అన్నారు. కానీ రుణమాఫీ పూర్తిగా జరగలేదనేది వాస్తవం అన్నారు. ఇక కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు.

కాంగ్రెస్ – బీజేపీలు రెండు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అందుకే ఈ వ్యవహారంలో ఈడీ దాడులు కూడా జరగడంలేదని ఆరోపించారు. ఈ కుంభకోణంపై తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు హరీష్ రావు. విచారణ జరిపి కుంభకోణంపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా డిమాండ్ చేశారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news