విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావొద్దు : సీఎం చంద్రబాబు

-

పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావొద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత పేరెంట్స్ పై ఉందన్నారు. యుక్త వయస్సులో పిల్లలు డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు మానవ సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news