తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థుల సమస్యల గురించి బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు సంబంధించిన మంత్రులు లేరు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా లేడు.. విద్యార్థుల యొక్క సమస్యలను ఎవ్వరికీ చెప్పుకోవాలని ప్రశ్నించారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.
రాష్ట్రంలో ప్రజా పాలన అన్నారు. కానీ ప్రజలపై కానీ నిరుద్యోగులపై ప్రతీకార పాలన నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికేట్లు తీసుకోలేక బాధపడుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలల్లోని ఫుడ్ పాయిజనింగ్ గురించి, భోజనంలో ఎలుకలు రావడం పై పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించిన విషయం విధితమే.