కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం..ఇవాళ్టి నుంచి పాఠశాలల్లో “చదవండి కంపైన్ కార్యక్రమం”

-

సీఎం కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి పాఠశాలల్లో “చదవండి కంపైన్ కార్యక్రమం” నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వంద రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. పిల్లల్లో చదివే ప్రాథమిక సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు వారిని స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల పఠన ప్రచార కార్యక్రమం జరుగనుంది.

చదవండి (చదవండి, ఆనందించండి, అభివృద్ధి కండి) కార్యక్రమంలో భాగంగా, ఉపాధ్యాయులందరూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాల లైబ్రరీలో వయస్సుకి తగిన పుస్తకాలను చదివేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.. అన్ని పాఠశాలలు ప్రతి తరగతికి ప్రతిరోజూ ఒక లైబ్రరీ పీరియడ్ తప్పనిసరిగా కేటాయించాలని… అలాగే ఉన్నత పాఠశాలలో ఒక్కో తరగతికి ఐదుగురు విద్యార్థులతో కూడిన కమిటీ, ప్రాథమిక పాఠశాలకు ఒకే కమిటీ వేయాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులకు పుస్తకాలు అందించడం, వాటి రికార్డును నిర్వహించడంతోపాటు విద్యార్థులలో గ్రంథాలయ పఠన అలవాట్లను పర్యవేక్షించడం కమిటీ బాధ్యత అనిపేర్కొంది. ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు అన్ని పాఠశాలల్లో గ్రంథాలయ వారోత్సవాలు, ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం, ప్రతి శనివారం పఠన పోటీలు, ప్రతినెలా తల్లిదండ్రులు, సంఘం సభ్యులు, పాఠశాల యాజమాన్యంతో పఠనోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news